సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో దారుణం జరిగింది. పల్సర్ బైక్ కొనివ్వలేదనే కోపంతో తండ్రిపై గొడ్డలితో కొడుకు దాడి చేశాడు. మంగళగూడెం గ్రామానికి చెందిన నాగయ్య కుమారుడు సతీష్ ఏపని లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తనకు మోటార్ సైకిల్ కొనివ్వాలని తల్లిదండ్రులను కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో గత అర్ధరాత్రి సమయంలో తండ్రి నాగయ్యపై.. కొడుకు సతీష్ గొడ్డలితో దాడి చేశాడు. దీంతో నాగయ్య భార్య నాగలక్ష్మి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి సతీష్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నాగయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. తన భర్త నాగయ్యపై కుమారు సతీష్ చేసిన దాడి గురించి నాగలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సతీష్ కోసం గాలింపు చేపట్టారు...
-----------------------
Admin