సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఐటిశాఖ మంత్రి కేటీఆర్ భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రాచలం పర్యటన సమయంలో విధి నిర్వహణ కోసం వచ్చిన కొత్తగూడెం 1టౌన్ కానిస్టేబుల్ శ్రీదేవి మరణం పట్ల ఓబీసీ డిక్లరేషన్ కమిటీ సభ్యులు, టీపీసీసీ కమిటీ సభ్యులు నాగా సీతారాములు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుల్ మృతి బాధాకరమని, కానిస్టేబుల్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కానిస్టేబుల్ మృతికి కేటీఆర్ బాధ్యత వహించాలని ఓబిసి డిక్లరేషన్ కమిటీ సభ్యులు టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు డిమాండ్ చేశారు. వర్షాకాలం వస్తే భద్రాచలం ప్రజలు, రాముడి భక్తులు పడుతున్న ఇబ్బందులు తెలిసినప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోక పోవడమే కానిస్టేబుల్ శ్రీదేవి మృతికి కారణమని కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ వారే గుసగుసలాడుకోవడంలో నిజమెంతో అధికారులు ఆరా తీయాలని అయన డిమాండ్ చేశారు. అటు వినాయక చవితి నిమజ్జన వేడుకల వల్ల తీవ్రంగా అలసిపోయిన పోలీస్ లను మంత్రి పర్యటన పేరుతో ఇబ్బంది పెట్టారని వస్తున్న ఆరోపణల పట్ల కూడ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. భద్రాచలం పట్టణానికి ఉన్న ప్రధాన సమస్య డ్రైనేజి అని దాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భద్రాచలం పట్టణాన్ని అటు పంచాయతీ ఇటు మున్సిపాలిటీ కాకుండా ఉంచి అధికారుల చేతిలో ఉంచడం వల్లే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. కానిస్టేబుల్ శ్రీదేవి మృతికి పూర్తి భాద్యత ఐటీశాఖ మంత్రి కేటీఆర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు భాద్యత వహించాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తానని అన్నారు.
-----------------------
Admin