Sunday, 26 July 2026 05:22:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నాగులపాటి అన్నారం గ్రామంలో కామ్రేడ్ ధనియాకుల గురవయ్య వర్ధంతి...

Date : 12 February 2024 08:15 AM Views : 279

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నిరుపేదల కుటుంబాలలో ఇప్పటికీ కామ్రేడ్ ధనియాకుల గురవయ్య చిరస్మరణీయంగా నిలుచున్నాడని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు తెలిపారు. కామ్రేడ్ ధనియాకుల గురవయ్య 25వ వర్ధంతిని పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారం ఆయన స్వగ్రామంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కామ్రేడ్ గురవయ్య పాలేరుగా ఉంటూ రాత్రి సమయంలో వయోజన విద్య లో కొద్ది గొప్ప చదువుకొని పాలేర్లు నిరుపేద సమస్యలపై నిరంతరం పాలకులతో భూస్వాములతో పోరాడుతూ ప్రజా ఆకర్షణ పొందాడన్నారు. గురవయ్య క్రమశిక్షణను చూసిన సిపిఎం హై కమాండ్ ఆయనను పార్టీలో చేర్చుకున్నారు అన్నారు. గురవయ్య గ్రామస్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి సూర్యాపేట తుంగతుర్తి ఉమ్మడి డివిజన్ల సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడన్నారు. దీంతో ఆయన సిపిఎం ను బలోపేతం చేసి ఈ రెండు డివిజన్లలో సిపిఎం పార్టీ ఎంపీపీలు.జెడ్పిటిసిలు.సర్పంచుల. ను అధిక స్థానాలు గెలిపించుకోవడo జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పై బ్యాంకు డైరెక్టర్ గా ఆయన గెలుపొందడమే కాక. ఆయన భార్య లక్ష్మమ్మను ఉమ్మడి నాగులపాటి అన్నారం గ్రామ సర్పంచ్ గా గెలిపించుకున్న ఘనత ఆయనకు ఉందన్నారు. దీంతోపాటు సింగల్ విండో చైర్మన్లు విద్య కమిటీ చైర్మన్ లు అధిక శాతం గెలిపించుకుని సిపిఎం రాష్ట్ర కమిటీచే ప్రశంసలు అందుకున్న ఘనత ఆయనకు ఉందన్నారు. ఇదంతా చూసిన ఆనాటి కాంగ్రెస్ ప్రత్యర్థులు గురువయ్యతో మనుగడ సాధించలేమని కుట్రపన్ని 1999 ఫిబ్రవరి 11వ తేదీన సూర్యాపేటలో ఒంటరిగా వెళ్తున్న గురవయ్యను మాటు కాసి వేట కొడవళ్ళు. కత్తులు గొడ్డళ్లతో నరికి చంపినారు. ఆయన చనిపోయినప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచి ఉన్నాడన్నారు. వర్ధంతిలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు. ప్రజలు గురువయ్య చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రణపoగి కృష్ణ. సీనియర్ జర్నలిస్ట్ ధనియాకుల వెంకటేశ్వర్లు గ్రామపంచాయతీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీనివాస్.. సిపిఎం గ్రామ కార్యదర్శి అయితబోయిన సత్యనారాయణగౌడ్. సిపిఎం సీనియర్ నాయకులు ముదిగొండ వీరస్వామి.శౌర్యాల జానయ్య చారి. గ్రామ మాజీ సర్పంచు మీసాల లచ్చయ్య మాజీ లిఫ్ట్ చైర్మన్ ధనియాకుల సత్యనారాయణ. కార్మికుల సంఘం నాయకులు. నకరికంటి వెంకటేశ్వర్లు సతీష్. రమేష్. రాంబాబు. బిక్షం. రవి యాదవ్ ఆరవస్వామి. కార్తీక్. తండు సురేష్.పెద్ద ఈదయ్య . విద్యార్థి సంఘాల నాయకులు ధనియాకుల అభిలాష్ చెరువుపల్లి ఉప్పయ్య. జిపి వర్కర్లు నకరికంటి నరసయ్య. నాగరాజు.సత్యం వీరస్వామి.పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: