సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చేన్నాపూర్ దేవేంద్ర నగర్ కాలనీలో సహాబా మసీద్ లో బస్తీ వాసులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాషా మీయ మాట్లాడుతూ.... 30 రోజులు అల్లాను తలుచుకొని నియమ, నిష్ఠలతో ఉపవాసాలు ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ 30 రోజులు పూర్తి చేసుకొని నెలవంకను చూసిన మర్నాడు రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది,పవిత్రంగా జరుపుకునే ఈ పండగ లో అసత్యాలు ఆడడం గొడవలు వెళ్లడం కనీసం తప్పుడు మాటను కూడా ఉచ్చరించకుండా ఎంతో నియమాలతో ఆచరిస్తూ అదేవిధంగా మహిళలు పిల్లలతో సహా ఉపవాసాలతో ఉంటూ ఎంతో పవిత్రంగా ఐదు పూటలు నమాజ్ చేస్తూ నిత్యం ఆ అల్లాను స్మరిస్తూ కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు మసీదులో అల్లాకు ప్రార్ధించి ఆరు తర్వాత పండ్లు పలహారాలతో రోజా నియమాన్ని వదులుతూ మర్నాడు నాలుగింటికి అల్పాహారం తీసుకుని మళ్లీ వాళ్ళ ఒక్కపొద్దును ప్రారంభిస్తారు ఇలా 41 రోజులపాటు చేసే ముస్లింల అతి పెద్ద పండుగ రంజాన్ ఈ ప్రత్యేక పండక్కి ప్రతి ముస్లిం సోదరులు తమ ఇంటికి బంధుమిత్రులను ఆహ్వానిస్తూ తమతో పాటు విందులో పాల్గొనేలా చేస్తారు రకరకాల వంటకాలతో హిందూ ముస్లిం తేడా లేకుండా తమ ఇంటికి ఆహ్వానిస్తారు తాము చేసే ప్రత్యేక వంటకాలతో భోజనాన్ని తమతో పాటు అందరికీ పంచి పెడుతూ విందులో పాల్గొని బందు పిల్లాపాపలతో బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా గడుపుతారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాషామియా మరియు జి కాలేశా మహమ్మద్ కాజా మహమ్మద్ మోహిన్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు...
-----------------------
Admin