సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక వారపు సంత రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ వారు కేటాయించిన స్థలాన్ని మించి రోడ్డు సైడ్ షాపులు కూడా నిర్వాహకులు పెట్టిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే లారీ యార్డ్ పక్కనే వారపు సంత పెడుతున్నారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఈ సంత జరుగుతుంది. రోడ్ల పైన వాహనాలు నిలిపి వాహనదారులు కూరగాయలు కొనుగోలు చేయడానికి సంతలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోడ్లపైనే వాహనాలు నిలపటం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగకముందే సంబంధిత అధికారులు వారపు సంత నిర్వహించే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు...
-----------------------
Admin