సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీటీసీ ముడేం గోపిరెడ్డి హుజూర్ నగర్ మార్కెట్ కమీటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ దొంతగాని పద్మ మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు కడియాల రామకృష్ణ సింగారం గ్రామశాఖ అధ్యక్షుడు గోపిరెడ్డి వెంకటరెడ్డి సింగారం గ్రామ ఉప సర్పంచ్ కర్నె సావిత్రి వీరారెడ్డితో పాటు సింగారం గ్రామానికి చెందిన అనేక మంది బీఆర్ఎస్ వార్డు సభ్యులు సింగల్ విండో డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాని రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముడేం గోపిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలలకే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి పనిచేసిన వారితో రెండవ గ్రూపు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ప్రోత్సహించి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాడని అందుకే అధికార పార్టీలో ప్రతిపక్షంగా కొనసాగలేమని తీవ్రస్థాయిలో ఆరోపించారు. అనంతరం హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... గత మున్సిపల్ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు చైర్మన్ పదవి ఇస్తానని హామీఇచ్చి మాట తప్పిడం వల్ల మనస్థాపం చెందినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి నియంత పోకడలతో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేమని ఆత్మ గౌరవం తాకట్టుపెట్టి ఇటువంటి రాజకీయాలలో ఇమడలేమని అందుకే బీఆర్ఎస్ పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు.తదుపరి కార్యాచరణ త్వరలోనే తెలుపుతామని హుజూర్ నగర్ నియోజకవర్గంలో నాయకులు ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయాలని బానిస రాజకీయాలు విడనాడాలని ఆయన హితవు పలికారు.
-----------------------
Admin