సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి , వారి కుమారుడు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజనం ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభించారు. ఆసుపత్రికి విచ్చేసి వివిధ అనారోగ్య సమస్యల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొనేందుకు వచ్చిన వారు అదే విధంగా మారుమూల గ్రామం నుంచి పట్టణంకి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, వివిధ పనులకు వచ్చే నియోజకవర్గ ప్రజలు అన్నదానం సద్వినియోగం చేసుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజనం కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని, ఇందులో భాగంగానే ఆర్డిటి హాస్పిటల్ దగ్గర నేటికీ 162వ రోజు ఎర్రంపల్లి మాగం ఈరన్న, గూబనపల్లి రమేష్ మంజు NTR అన్న క్యాంటిన్ ఉచిత భోజనం వడ్డించారు. అదే విధంగా పార్టీ కార్యాలయం దగ్గర విట్లంపల్లి భీమలింగ, దండా ఏకాంత్, మరేంపల్లి పెయింటర్ రాజు, భోజనం వడ్డించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1:00pm నుంచి కొనసాగుతోంది...
-----------------------
Admin