Monday, 27 July 2026 05:05:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...

Date : 25 April 2024 10:31 AM Views : 753

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : శుభకార్యానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్‌ గోవిందాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పయనమయ్యారు. విజయవాడ సమీపంలో ఉన్న గుణదలలోని టెంపుల్ లో చిన్నారికి చెవులు కుట్టించేందుకు బయలుదేరారు. కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నారు. కోదాడ పట్టణ సమీపంలోని దుర్గాపురంలో అప్పటికే బ్రేక్ డౌన్ అయి లారీ ఆగిపోయింది. దీన్ని గమనించని కారు వేగంగా వచ్చి, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు ఘటనాస్థంలోనే చనిపోగా, గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :