సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయి...ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే అవి సమసిపోతాయని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలో వివిధ రకాల రాజీపడదగు కేసులలోని కక్షీదారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసారు. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో 01-09-2023 నుండి 09-09-2023 వ తారీఖు వరకు కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం కోర్టులలో "నేషనల్ లోక్ అదాలత్" సందర్భంగా కక్షీదారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు సంబంధించిన ప్రజలకు మందలపల్లి గ్రామంలో ఈ నెల 06.09.2023వ తేదీన న్యాయాధికారులు అందుబాటులో ఉంటారని తెలియజేసారు. మీకు తెలిసిన వాళ్లపై ఏమైనా కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని అన్నారు. యాక్సిడెంట్ కేసులు,కొట్టుకున్న కేసులు,చీటింగ్ కేసులు,వివాహ బంధానికి సంబంధించిన కేసులు,చిన్న చిన్న దొంగతనం కేసులు, కరోనా సమయంలోని కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఇతర రాజీ పడదగు కేసులలో ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని అన్నారు. కేసును బట్టి 50 రూపాయల నుండి 1000 రూపాయల వరకు జరిమానా చెల్లించి తమపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలియజేసారు. కాబట్టి ఈ అవకాశాన్ని కేసులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు. దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత కోర్ట్/ప్రదేశంలో హాజరుకావాలని తెలిపారు.ఈ రెండు రోజులపాటు జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ కేసులు 130, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 340,ఈ-పెట్టీ కేసులు 380 కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.
-----------------------
Admin