సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన కాళేశ్వరం ఎస్‌ఈసీ నూనె శ్రీధర్ (Nune Sridhar) వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నూనె శ్రీధర్ వ్యవహారంలో మరి కొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ (ACB) దర్యాప్తులో బయటపడింది. 2024 జూన్ 27న నూనె శ్రీధర్‌ను ఇరిగేషన్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆదేశించారు. అయితే ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాలను కూడా నూనె శ్రీధర్ పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌ఫర్ అయినప్పటికీ కూడా ఏడాది పాటు చొప్పదండిలోనే ఈఈగా శ్రీధర్ పని చేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈఎన్‌సీ అనిల్ ఆదేశాల మేరకే శ్రీధర్ అక్కడే పని చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూనె శ్రీధర్‌కు ఈఎన్‌సీ అనిల్‌కు ఉన్న సంబంధాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇరిగేషన్ చీఫ్‌గా ఉండి ప్రిన్సిపాల్ సెక్రటరీ చేసిన ట్రాన్స్‌ఫర్‌ను కూడా ఆపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నూనె శ్రీధర్‌ను కస్టడీకి తీసుకుని విచారించాలని ఏసీబీ నిర్ణయించింది. అలాగే ఈఎన్‌సీ అనిల్ పాత్రపైనా ఏసీబీ విచారణ జరిపే అవకాశం ఉంది. అక్రమాస్తుల కేసులో నూనె శ్రీధర్‌ను ఏసీబీ అరెస్ట్ చేయగా.. ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. శ్రీధర్‌కు సంబంధించిన అంశాలపై ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఇరిగేషన్ శాఖ అధికారులతో నూనె శ్రీధర్‌కు ఉన్న సంబంధాలు ఏంటి.. ఇతనికి ఎవరైనా సహకారం అందించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల శ్రీధర్‌కు సంబంధించి సుమారు 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో కీలకమైన పత్రాలు, ఆస్తుల చిట్టాను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఎంతో గ్రాండ్‌గా శ్రీధర్ తన కుమారుడి వివాహం జరిపించారు. హైదరాబాద్‌లో హల్దీ, సంగీత్ ఫంక్షన్లు నిర్వహించగా.. థాయిలాండ్‌లో వివాహం జరిపించారు. ఇందుకోసం శ్రీధర్ కోట్లు కుమ్మరించినట్లు తెలుస్తోంది. అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌కు ఇంత భారీ మొత్తంలో ఆస్తులు, ఆదాయం ఎలా సమకూరింది అనే అంశాలపై ఏసీబీ దృష్టి సారించింది...
-----------------------
Admin