సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గంజాయి సరఫరా చేస్తే హిస్టరీ షీట్స్ నమోదు, అలవాటుగా చేస్తే పీడీ యాక్ట్ తప్పదు జిల్లాలో గంజాయి కేసుల్లో ఉన్న 65 మంది నేరస్తులపై హిస్టరీ షీట్స్ నమోదు చేశాం జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ లు నిర్వహిస్తున్నాం. పెండింగ్ కేసుల పరిష్కారానికి సిబ్బంది ప్రణాళికతో పని చేయాలి. విదుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచన. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులు విధులు నిర్వహణలో వత్తిడి లేకుండా అప్రమత్తంగా పని చేయాలని దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, డీస్పీ లు రవి, శ్రీధర్ రెడ్డి, డీసీబఆర్డి డీస్పీ మట్టయ్య, సైబర్ సెక్యూరిటీ డీస్పీ శ్రీనివాస రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ ఐ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ గంజాయి నిర్మూలన లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పని చేయాలని, గంజాయి కేసుల్లో ఉన్నవారిపై హిస్టరీ షీట్స్ నమోదు చేయాలని, అలవాటుగా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెట్టాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు గంజాయి కేసుల్లో 65 మంది నేరుస్తులపై పోలీస్ స్టేషన్స్ నంధు హిస్టరీ షీట్స్ నమోదు చేశామని తెలిపినారు. ప్రతి నెల మూడవ బుధవారం రోజున యాంటీ డ్రగ్స్ డే గా ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. ప్రజల మెరుగైన భద్రత, రక్షణ కల్పించడం, అక్రమ రవాణా అరికట్టడం, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు, నేరాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ లు, పటిష్టమైన పెట్రోలింగ్, పోలీస్ బీట్స్ నిర్వహించాలని సిబ్బందికి తెలిపినారు, క్షేత్రస్థాయి పోలీసు విధులపై ఇన్స్పెక్టర్స్, డీస్పీ లు పర్యవేక్ష్యన చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ను ఎల్లప్పుడు పరిశీలిస్తూ నివారణ చర్యలను తీసుకోవాలి, ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత వివరాలు అపరిచితులకు తెలపవద్దు. సైబర్ నేరాలపై అవగాహన్ కల్పించాలి. సైబర్ నేరాలపై ప్రణాళికతో పని చేయాలి.పోలీసు వాహనాల నాణ్యతను పరిశీలించారు, వాహనాలు కడిషన్ లో ఉండాలని తెలిపారు. అనంతరం కేసుల నమోదు, పెండింగ్ కేసుల రికార్డ్స్ పరిశీలించారు. పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారానికి ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, ఒత్తిడి లేకుండా పని చేయాలి కోరారు. ప్రజా ఫిర్యాదులపై, డయల్ 100 పిర్యాదులపై త్వరగా స్పందించాలి, సైబర్ మోసాల పట్ల ప్రజలను అవగాహన కల్పించాలి. ప్రజలతో, స్థానిక యువతతో మంచి సంభందాలు కొనసాగించాలి ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం వచ్చేలా సమాచార వనరులను బలోపేతం చేసుకోవాలి, సోషల్ మీడియాను లో ఎలాంటి వాటిపై పోస్టింగ్ లు పెడుతున్నారు, అసత్యాలు, రూమర్స్ ప్రచారం చేస్తున్నారు అనేదానిపై కూడా నిఘా ఉంచాలి అని ఆదేశించారు. కొత్త వ్యక్తుల కదలికలు గమనించాలి అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, జాతీయ రహదారి 65 వెంట ఉన్న గ్రామాల ప్రజల్లో రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించాలి అన్నారు....
-----------------------
Admin