సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలను విస్మరించి అభివృద్ధిని గాలికి వదిలేసిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కల్లబొల్లి మాటలతో కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ఆయన అన్నారు గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ ప్రభుత్వం మరో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే యోజనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు పండించిన ప్రతి పంటకు బోనసిస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం వరి పంటకిచ్చి మిగిలిన పంటలకు బోనస్ ఇవ్వడం లేదని ఆయన అన్నారు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు లక్షల పైన రుణం తీసుకున్న రైతులను విస్మరించిందని ఆయన అన్నారు గత ప్రభుత్వం పంట బీమా జోలికి పోకుండా రైతులు నట్టేట ముంచితే ఈ ప్రభుత్వం మేమే బీమా ప్రీమియం కడతామని చెప్పి ఏడాది గడిచిన పంట బీమా అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు అధికారంలోకి రాగానే రైతుబంధును పెంపు చేసి రైతు భరోసా పేరిట ఎకరానికి 15000 ఇస్తామని చెప్పి ఏడాది గడిచిన ఇంకా కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని ఆయన అన్నారు ప్రతి మహిళకు రూపాయలు 2500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని ఏమైందని అడిగితే సబ్ కమిటీ వేశాము ఇస్తామని మభ్యపెడుతుందని ఆయన అన్నారు ఇందిరమ్మ ఇండ్లు కాగితాలకే పరిమితమయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లనే ఇందిరమ్మ ఇండ్లు గా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బ్రహ్మానద్. వేణుగోపాల్ ఆకుల ప్రవీణ్ జోగు రవి, మయూర్ చంద్ర విజయ్ జ్యోతి రఘుపతి . దినేష్ మటాలియ. గ0గారెడ్డి.నగేష్. అశోక్ రెడ్డి శ్రీనివాస్ కృష్ణ యాదవ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin