సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని జర్నలిస్టులు అందరూ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వరకు జర్నలిస్ట్ వృత్తిని చేసుకుంటూ బతుకుతున్నారు . ఇప్పటి వరకు ప్రభుత్వ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. మిర్యాలగూడలో కొంతమంది జర్నలిస్టులు మేమే జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఎలాంటి కమిటీ వేయకుండా అర్హత లేని జర్నలిస్టుల కొంతమంది జాబితా ను తయారు చేయడం జరిగింది ఇంతవరకే జర్నలిస్టులని సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. కావున జర్నలిస్ట్ అందర్నీ కలుపుకొని ఒక కమిటీ వేసి మిర్యాలగూడ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వగలరని శుక్రవారం రోజున సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్త విలేఖరి లక్ష్మణ్ ప్రజా జ్యోతి విలేకరి రాంప్రసాద్ ప్రజా దర్బార్ విలేఖరి నర్సింహా మన నేటి తెలంగాణ విలేఖరి అలుగుబెల్లి వెంకట్ మనం న్యూస్ విలేకరి పరకాల సురేష్ తెలంగాణ పత్రిక విలేకరి మెరుగు భరత్ సృజన కాంతి విలేఖరి కే సైదులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin