సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లోని వరదాపురం గ్రామం లో మండు టెండలలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని బి అర్ ఎస్ పార్టీ యువ నాయకులు నందిపాటి సోమయ్య డిమాండ్ చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలతో కలిసి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీలు వేసవిలో ఎర్రటెండలలో పనిచేస్తున్న వారికి నీడ కోసం కనీసం టెంటు సౌకర్యాలు, కల్పించాలని ఓఆర్ఎస్ ,మజ్జిగ ప్యాకెట్లు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని కోరారు.కొలతలతో సంబంధం లేకుండా రోజువారి కూలీల క్యూబింగ్ మీటర్ రేటును ఇవ్వాలని పని స్థలం వరకు ఆటో సౌకర్యం కల్పించాలని అదేవిధంగా గతంలో ఉన్న విధంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆన్లైన్ హాజరు తీసివేసి ఆఫ్లైన్ మ్యానువల్ మాస్టర్ రోల్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-----------------------
Admin