సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : దామచర్ల మండలంలోని కొండ్రపోల్ కేశవపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇరిగేషన్ అధికారులు, గ్రామస్థులు, రైతులతో కలసి ప్రాజెక్టు ను పరిశీలించారు .. అనంతరం కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా నష్ట పోయిన రైతులకు ఎందుకు నష్ట పరిహారం చెల్లించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరో సంవత్సరం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు .. బిల్లుల విషయంలో ఏదైనా ఆలస్యం అవుతే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడతాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపకూడదని అన్నారు.. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఎంత వరకు పూర్తయింది ఇంకా ఎంత వరకు ఉంది అనే ప్రాజెక్టు పూర్తి వివరాలు నాకు అందించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
-----------------------
Admin