Monday, 27 July 2026 07:14:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో కుష్టు వ్యాధి సర్వే... - డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి

Date : 20 August 2023 12:32 AM Views : 325

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు పరిధిలోని సబ్ సెంటర్ "సి " ఏరియాలో నిర్వహిస్తున్న లెప్రసీ సర్వేను డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి క్షేత్రస్థాయిని పరిశీలించారు. అక్కడ ఉన్న ఎమ్.ఎల్.ఎచ్.పి. డాక్టర్ షేక్ ముస్తాఫిన్ హమ్మద్ తో మాట్లాడి అక్కడ జరుగుతున్న లెప్రసీ సర్వేను గురించి అడిగి డాక్టర్ ఎస్ జయలక్ష్మి తెలుసుకున్నారు. ఇందిరానగర్ కాలనీలో ఆశాలు చేస్తున్న లెప్రసీ ఇంటింటి సర్వేను, హౌస్ టు హౌస్ తిరిగి డాక్టర్ ఎస్ జయలక్ష్మి పరిశీలించారు. కుష్టు వ్యాధి ఒక సూక్ష్మ క్రిమి (మైకో బ్యాక్టీరియం లేప్రే) ద్వారా సోకే వ్యాధి అని, ఇది వంశపారంపరంగా రాదు అని జయలక్ష్మి చెప్పారు. శరీరంపై ఎక్కడైనా స్పర్శ కోల్పోవడం, ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణమని చెప్పారు. వ్యాధి లక్షణాలు స్పర్శ లేని/ మొద్దు బారిన చర్మం, మచ్చలు కుష్టు వ్యాధి కావచ్చు అని, కనుబొమ్మలు రాలిపోవడం, చెవితమ్మెలు మందంగా మారడం, చేతులు, కాళ్ళలో తిమ్మిరిలు, వాపులు, పుండ్లు, బొబ్బలు, ఒంటిపైన గడ్డలు, కాయలు రావడం ముక్కు నుంచి రక్తం పడడం, వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గరలో గల ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించాలని తెలియజేశారు. వ్యాధి నిర్ధారణ చికిత్స అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా జరుపబడును. ఈ వ్యాధికి నిర్ధారించిన తర్వాత 6 నుండి 12 నెలలు చికిత్సతో వ్యాధి పూర్తిగా నయం అవుతుందని తెలియజేశారు. వ్యాధి వలన ఏర్పడిన అంగవైకల్యం శాస్త్ర చికిత్సతో సరి చేయవచ్చని చెప్పారు. వ్యాధి బారిన పడిన వారందరూ తమ తమ పూర్తి సామాజిక జీవితం గడపవచ్చని చెప్పారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి యం.డి.టి. చికిత్స ఇచ్చినచో కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారి తీయదు అని చెప్పారు. కుష్టు వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి, లక్షణాలు ఏర్పడడానికి సగటు మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ షేక్ ముస్తాకిన్ అహ్మద్ , హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఆశాలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: