Monday, 27 July 2026 03:24:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం... - టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్

Date : 04 November 2023 11:33 AM Views : 239

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ రోడ్ లో కాంగ్రెస్ యువ నాయకులు వలిగి ఆనంద్(నందు), రాజశేఖర్, నీరటి వాసు ల ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, మైనార్టీ నేత జమ్రుద్ ఖాన్, దంగు శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి వీర్లపల్లి శంకర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు కార్యకర్తలు వీర్లపల్లి శంకర్ పై పూలు చల్లుతూ, బాణాసంచాలు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాంతికి చిహ్నంగా చెప్పుకొనే పావురాలను ఎగురవేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలులు వీస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆయన తెలిపారు. పదేళ్ల పాలనలో ప్రజలకు బీఆర్‌ ఎస్‌ చేసింది శూన్యమని, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలు ఎలాగా పనిచేశారో అలాగే బీ ఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌తీ కార్య‌క‌ర్త ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. కొన్ని రోజులు క‌ష్ట‌ప‌డితే పార్టీ విజ‌యం ఖాయ‌మ‌న్నారు. ఇప్ప‌టికే ఆరు గ్యారంటీ స్కీంలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు విజ‌య‌వంత‌మ‌య్యార‌ని అన్నారు. మున్ముందు కూడా ఇలాగే సమిష్టిగా కృషిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బస్వం అప్ప, పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :