సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కనకదుర్గమ్మ తల్లి దీవెనలతో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే వనమా అన్నారు. సోమవారం కొత్తగూడెం, రామవరం పట్టణాల్లో రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు మరోసారి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin