Sunday, 26 July 2026 04:21:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారా... వెంటనే ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్...

Date : 30 December 2023 10:12 AM Views : 247

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ : ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. అడ్డమైన లింకులు పెట్టి అడ్డంగా దోచుకునే సైబర్ ముఠాలు.. వైఫైలా మన చుట్టూరా ఉన్నాయి. అలాంటి వాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితులకు కొన్ని కీలక సూచనలు చేశారు పోలీసులు. ఇన్‌స్టా.. స్నాప్‌చాట్‌.. ఫేస్‌బుక్‌.. వాట్సాప్.. ఇలా అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. రోజూ కొన్ని వేల మంది అమాయకులు సైబర్ చీటర్స్ చేతిలో మోసపోయి.. లక్షలాది రూపాయల డబ్బు పోగొట్టుకుంటున్నారు. అలాంటి బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు పోలీసులు . సైబర్ క్రైమ్స్ కేసుల ఎఫ్‌ఐఆర్‌ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గతంలో లక్షా 50వేల కంటే ఎక్కువ మొత్తంలో పోగొట్టుకున్న బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవారు. అలాగే 1930 ఫోన్ చేయాలి. లక్షా యాభై వేల కంటే తక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న సందర్భంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేవారు. అయితే 50వేల లోపు పోగొట్టుకున్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. ఇన్ స్పెక్టర్ లేదా డి‌ఐ ర్యాంక్ అధికారులు దర్యాప్తు చేస్తారన్నారు. ఇక 50వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నట్టు ఫిర్యాదులు వస్తే.. సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేస్తారన్నారు. సైబర్ క్రైమ్స్ నేరాలకు సంబంధించిన ఇతర ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్ నమోదు చేయాలని ప్రజలకు సూచించారు సీపీ మహంతి. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతోందనీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తు్న్నారు. స్పామ్ లింక్‌లు, ఫ్రాడ్ అప్లికేషన్లను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :