Monday, 27 July 2026 03:25:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిజాలు మాట్లాడుతున్న ప్రతాప్ రెడ్డి పై వ్యక్తిగతంగా మాట్లాడితే ఖబడ్దార్...

Date : 30 October 2023 02:03 AM Views : 237

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నిజాలను దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడితే అధికారం రాదని, షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు ఏమిటో మొత్తం తెలుసని దమ్ముంటే చౌరస్తాకు రావాలని ఈ అంశంపై చర్చించడానికి తగిన ఆధారాలతో తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘు, పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెంది తిరుపతి రెడ్డిలు ఘాటుగా విమర్శించారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కోంకల్ల చెన్నయ్య తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెంజర్ల సభ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాజకీయ విమర్శలు చేస్తే దానికి రాజకీయ విమర్శలు చేయాలి కానీ బుద్ధి ఉందా? ఇంకిత జ్ఞానం ఉందా? అని పరుష పదజాలాలు వాడడం సిగ్గుచేటని వారు అన్నారు. టిఆర్ఎస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జెడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, జమ్రుద్ ఖాన్ తదితరులు ప్రజాసభల్లో ఎమ్మెల్యే ఆయన కుమారుల గురించి వాస్తవాలు మాట్లాడుతున్న తీరుపై టిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. టిఆర్ఎస్ నాయకుల బండారం, ఎమ్మెల్యే ఆయన కుమారుల రాజకీయ వ్యవహారాలను పరిపాలనలో వారి జోక్యాన్ని ప్రజలకు వివరిస్తుంటే ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుందని దీనిని జీవించుకోలోకనే టిఆర్ఎస్ శ్రేణులు వ్యక్తిగత విమర్శలకు దిగారని తెలిపారు. ప్రతాప్ రెడ్డిని విమర్శించిన కొత్తూరు నాయకులు కొందరు తమ భార్యల ప్రభుత్వ పదవులను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని కనీసం నాయకులుగా కూడా మాట్లాడే ధైర్యం వారికీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఆయన కుమారులు ఇద్దరు నియోజక వర్గంలో కొన్ని మండలాలు పంచుకున్నారని రోడ్డుకు అవతల మూడు మండలాలు పెద్ద కుమారుడు, రోడ్డుకు యువతల మూడు మండలాలు చిన్న కుమారుడు పంచుకున్నారని, ఇప్పుడు కూడా ఇదే చెబుతామని ప్రజలందరికీ ఈ విషయం ఏనాడో తెలుసని, పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నందుకు మాత్రమే తమ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని వారు అన్నారు. నిజాలు నిర్భయంగా మాట్లాడితే సభలో విమర్శిస్తే టీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ సభలు, సమావేశాలు మీడియాలో రాకుండా అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని వారు చెప్పుకొచ్చారు. పెంజర్ల సభ తర్వాత మీడియాను బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. వీర్లపల్లి శంకర్ గెలిస్తే నియోజక వర్గంలో కార్యకర్తలే కాదు ప్రజలు అందరూ ఎమ్మెల్యేలని వారందరికీ అధికారం ఉంటుందని అంతేకానీ ఒకే కుటుంబంలో అధికారం ఉండదని అన్నారు. నియోజక వర్గంలో జరుగుతున్న అరాచకాలపై షాద్ నగర్ చౌరస్తాలో చర్చించేందుకు తగిన ఆధారాలతో వస్తామని దమ్ముంటే టిఆర్ఎస్ నాయకులు లేదా ఎమ్మెల్యే వచ్చిన పర్వాలేదని వారు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గిరిజన నేతలు శీను నాయక్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :