సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తల్లాడ లో ముస్లిం మైనార్టీ నాయకులు యాకూబ్ పాషా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నూతన పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు టీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్. యాకూబ్ పాషా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ 57 ఏళ్లు నిండిన వారందరికీ నూతన పెన్షన్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ మాట ఇస్తే తప్పరని, ఈ నిధులు మంజూరు చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మూడోసారి కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యంచెప్పారు. నూతన పెన్షన్లు మంజూరైన వారు బ్యాంకుల్లో తమ నగదును తీసుకోవాలని ఆయన కోరారు.
-----------------------
Admin