సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవుల చెరువు మండలం, సున్నంపల్లికి రోడ్డు మోక్షం ఎప్పుడో ....? దేవుడా నువ్వే దిక్కు..... ఎన్నో హామీలు ఇచ్చారు నెరవేరింది ఏమీ లేదు.... మా రోడ్డు బాగా చేసిన వాళ్లే లేరు..... ఓబుల దేవర చెరువు మండలం సున్నంపల్లి గ్రామం నందు రోడ్డు, మోరి, బ్రిడ్జ్ మరమత్తు కోసం మూడు గ్రామాల ప్రజల విన్నపం.... ఓబుల దేవర చెరువు మండలం సున్నంపల్లి గ్రామ ప్రజలు తెలుగుదేశం మండల నాయకులు, కార్యకర్తలు, విన్నవించిన విన్నపం ఏమనగా, గత రెండు సం"రాలు నుండి మూడు పల్లెలు అనగా సున్నంపల్లి, మలకవారి పల్లి, పెద్దగుట్లపల్లి ఈ పల్లెలకు వెళ్లే ప్రధాన దారికి రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే చాల మంది ద్విచక్ర వాహనం బోల్తపడి చాలమంది గాయలకు గురి అవుతున్నారు చుట్టు పక్క గ్రామాలలో రాకపోకలు బంద్ దారి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము . ఇలా సంభవించడం వల్లన కూలి పనులకు వెళ్లలేక పూట గడవక ఇబ్బంది పడుతున్నారు దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నీ నిర్మించాలని . గతంలో కూడా చాలాసార్లు ఈ రోడ్డు వర్ష కారణము వలన ఈ రోడ్డు కొట్టుకుపోవడం సున్నంపల్లికి మలక వారి పల్లికి, పెద్ద కుoట్లపల్లికి, తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అక్కడ ప్రజలకు కూలి పనులు, వైద్యము అందడం లేదు తాగునీరు ఇబ్బందులు ఇలా అయితే అక్కడ పరిస్థితులు ఏమిటి? ఒకవేళ దీని పైన మీరు దృష్టి సారించకపోతే రాబోయే రోజులలో దర్నాలు, రాస్తారోకోలు, రైలే నిరాహార దీక్షలు చేపడతామని గ్రామ ప్రజలు టిడిపి నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబులరెడ్డి, టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర, టిడిపి మండల మైనార్టీ నాయకుడు షాను, తుమ్మలమహబూబ్ బాషా, మండల ప్రధాన కార్యదర్శి పిట్ల సుధాకర్ , మల్లేశ్వరి, అఖిల, గంటా శ్రీనివాసులు, సీనా మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin