Monday, 27 July 2026 09:39:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యుత్ సంస్థలో ఉద్యోగులకు కార్మికులకు ప్రతినెల 1 వ తేదీన వేతనాలు చెల్లించాలి... -TSUEEU-CITU డిమాండ్

Date : 12 July 2023 09:51 AM Views : 484

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : విద్యుత్ సంస్థలో గత కొంతకాలంగా నెల వేతనాలు ఆలస్యం అవడం వల్ల ఉద్యోగులు కార్మికులు, పీస్ రేట్ కార్మికులకి అన్ మ్యాన్ కార్మికులకి అనేక ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూలై నెలలో 11 వ తారీకు వచ్చిన ఈరోజు వరకు కూడా కార్మికులకు ఉద్యోగులకు వేతనాలు రాలేదు. వెంటనే యాజమాన్యం వేతనాలు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కొత్తగూడెం డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కొలగాని రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ విద్యుత్ సంస్థలో 11 వ తారీకు వచ్చిన వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది.సంస్థలో కార్మికులు ఉద్యోగులు ఇంజనీర్లు అన్ మ్యాన్ కార్మికులు అందరూ ఎంతో కష్టపడి వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ఎండకి, వానకి,తుఫాన్లకి, వరదలకు ,అన్నిటికి తట్టుకొని ఎన్నో వ్యయప్రయాసలకు. తట్టుకొని వినియోగదారులకు నిరంతరం 24 గంటలు విద్యుత్తును అందించడం జరుగుతుంది. కార్మికులు ఎంతో కష్టపడి విద్యుత్ రెవిన్యూ ప్రతి నెల 100% కలెక్షన్స్ తీసుకొచ్చి సంస్థకి లాభాలు నడవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కార్మికులకి ఒకటో తారీకు వేతనాలు రాకపోయేసరికి నెల నెల చెల్లించే ఇంటి అద్ధేలు,పాల బిల్లులు, కిరాణం ,EMI లు మొదలగువాటిని చెల్లించడానికి ఎంతో ఇబ్బందులు కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. కార్మికులకు విపరీతంగా పని భారం పెరిగినా సంస్థ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గాని యాజమాన్యం సరైన సమయంలో వేతనాలు చెల్లించకపోవడం అన్యాయం, వెంటనే కార్మికులకి వేతనాలు ప్రతినెల 1వ తేదీనా చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టే వెంకటేశ్వర్లు, డివిజన్ కార్యదర్శి పులి గణేష్ బాబు, అధ్యక్షులు జి వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ టి.రవికుమార్ మరియు యూనియన్ కమిటీ సభ్యులు జి.రాధాకృష్ణ, రవితేజ, ఆనంద్ రెడ్డి, నరసింహారావు, కొండల్, అక్రమ్ ,నాగేంద్ర కుమార్, హుస్సేన్,ఎడుకొండలు మొదలగు కార్మికులు పాల్గొనడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :