Monday, 27 July 2026 05:03:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయం... -ఎస్పీ డా.వినీత్.జి

Date : 29 October 2023 09:03 AM Views : 236

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమాలలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ప్రాభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయడం గర్వకారణం అని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరికి తెలియజేయడంలో భాగంగానే పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21 నుండి సైకిల్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, ఫోటోగ్రఫీ పోటీలు,ఆన్లైన్ ఓపెన్ హౌస్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని సుమారుగా 120 ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ,విద్యార్థులకు ప్రస్తుతం పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న ఆయుధాలు,బాంబు స్వాడ్ సామాగ్రీ గురించి వివరించడంతో పాటు జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ జాగిలాల పనితీరును కూడా వారికి ఆన్లైన్ ద్వారా వివరించడం జరిగింది. పోలీస్ అమరవీరుల త్యాగాలను భావిభారత పౌరులైన విద్యార్థులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్. ,రిసెప్షన్, స్టేషన్ రైటర్,బ్లూ కోల్ట్స్ పనితీరు, పోలీస్ వాహనాల వినియోగం గురించి పోలీస్ స్టేషన్లోని అన్ని విభాగాల గురించి వివరించారు. జిల్లా ప్రజలను, యువతీ యువకులను,విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, కొత్తగూడెం త్రీ టౌన్ సిఐ మురళి,1టౌన్ సిఐ కరుణాకర్,అడ్మిన్ ఆర్ఐ రవి, ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఆర్ఐ నాగేశ్వరరావు, ఐటి కోర్ ఇంచార్జి సిఐ సతీష్, ట్రాఫిక్ ఎస్సై నరేష్, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :