Sunday, 26 July 2026 05:24:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి... - ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్

Date : 13 December 2024 03:14 AM Views : 419

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడపట్టణంలో వాహన రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా,ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా రోడ్డు నిబంధనలను పాటిస్తూ ఆటోలను నడుపుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ సూచించారు. గురువారం మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబందనలుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈనెల 18 నుండి లోకల్ ఆటోలకు పిసి నెంబర్ ఇన్ ఇవ్వడం జరుగుతుందని దీనికి సంబంధించి ఆధార్ లైసెన్స్ ఆర్ సి సభ్యతత్వం రషీద్ తీసుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయించుకోవాలని ఆయన అన్నారు ఆటో డ్రైవర్లు తమ ఆటోల వల్ల ఇతరులకు ఆటంకాలు, ఇబ్బందులకు గురికాకుండా తమ వాహనాలను నడుపుకోవాలని సూచించారు. ఆటోలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నవారు తమ సూచనలు హెచ్చరికలు పేడచెవిన పెడితే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై ఉన్న మార్కులోపు వాహనాలను, ద్విచక్రవాహనాలను ఆపుకునేలా వాహనదారులకు సూచించారు.లేనిపక్షంలో జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. మొదటిసారిగా హెచ్చరిస్తామని అటు తరువాత మార్పురాని పక్షంలో చర్యలు తప్పవన్నారు. కొందరు ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. సీరియల్ వారీగా ఆటోలను ఆపుకుని, ఆర్టీసీ బస్సులకు ఆటంకాలు కల్పించకుండా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాలన్నారు. ఇష్టారాజ్యంగా కూడలిలో ఎక్కడబడితే అక్కడ ఆటోలలో ప్రయాణీకులను ఎక్కించుకొని ట్రాఫిక్కుకు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. ఆటోలలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకుని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ప్రతి ఒక్క ఆటోడ్రైవర్ డ్రెస్ కోడ్ వేసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆటో యూనియన్ సంఘ నాయకులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: