Sunday, 26 July 2026 11:55:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రెండో ఏఎన్ఎంల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం నిరసన శిబిరంలో మాట్లాడుతున్న పదవ వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ...

Date : 25 August 2023 02:02 AM Views : 406

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (కలెక్టరేట్) : రెండో ఏఎన్ఎంల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, సమస్త ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అసెంబ్లీలో, వేదికలపై ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మోసం చేసేందుకేనా అని కొత్తగూడెం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు మునిగడప పద్మ ప్రశ్నించారు. క్రమబద్దీకరణ డిమాండ్పై రెండో ఏఎన్ఎంలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన తొమ్మిదో రోజు నిరసన శిభిరాన్ని గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా, మిడ్డేమీల్స్, రెండో ఏఎన్ఎం వంటి తదితర ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ అనుబంద సంస్థల్లో పనిచేస్తు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ పావులగా వాడుకుంటోందని, కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారం, పథకాల అమలుకోసం వాడుకుంటుందే తప్ప వారికి చట్టబద్దంగా అమలు కావాల్సిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. హామీలు అమలు చేయకుండా మహిళా ఉద్యోగులను రోడ్లెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. 16 సంవత్సరాలుగా రెండో ఏఎన్ఎం హోదాతో ప్రజలకు వైద్యసేవలందిస్తూ ఎంతో అనుభవం ఉన్న మహిళా సిబ్బందిని వైద్యశాఖ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా ఉద్యోగ ప్రకటన విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్లను క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటనను అమలు చేయాలని, హక్కులు అమలు చేయాలని రెండో ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. చర్చల పేరుతో కాలాయాజన చేయకుండా ఏకైక డిమాండైన క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో రెండో ఏఎన్ఎం యూనియన్ జిల్లా నాయకులూ ఎండి. సజ్జుబేగం, బానోతు ప్రియాంక, కౌసల్య, అరుణ, రాములమ్మ, పార్వతి, పుష్ప, బాల నాగమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :