సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి , వైస్ ఛైర్మన్ కోతి సంపత్ రెడ్డి లకు వినతి పత్రాలు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ ఆద్వర్యం లో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ మాట్లాడుతూ గతం లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నుంచి పౌర సరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డిని సూర్యాపేట జిల్లా కలెక్టర్ మరియు హుజూర్నగర్ ఆర్డిఓ, హుజూర్నగర్ ఎమ్మార్వో, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి లను కలిసి విద్యార్థులను బావి భవిత పౌరులుగా తీర్చిదిద్దే ప్రైవేటు ఉపాధ్యాయులు చాలీచాలని జీతాలతో ఇల్లు లేక అద్దె ఇళ్లలో జీవితం కొనసాగిస్తూ అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారని కావున నిరుపేద ప్రైవేట్ టీచర్ లను ఆదుకోవాలని మరియు ఇందిరమ్మ ఇళ్లను సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు కేటాయించాలని వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు . అదేవిదంగా హుజూర్ నగర్ లో ఉన్న 28 వార్డులలో ఉన్న ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కావున ఇందిరమ్మ కమిటీల వారు సర్వే చేసి సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి , వైస్ ఛైర్మన్ కోతి సంపత్ రెడ్డి లను కోరమన్నారు. అందుకు మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి , వైస్ ఛైర్మన్ కోతి సంపత్ రెడ్డి లు సానుకూలంగా స్పందించారు అన్నారు.ఈ కార్యక్రమం లో హుజూర్నగర్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి చికాకుల శ్రీనివాస్ చారి లు వైస్ ప్రెసిడెంట్ రానబోతు వెంకట్ రెడ్డి లు పాల్గొన్నారు.
-----------------------
Admin