సర్కార్ టీవీ న్యూస్ / నిర్మల్ జిల్లా : భైంసాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ ఏర్పాటు చేశారు. హైకోర్టు షరతులతో భైంసాకు మూడు కిలోమీటర్ల అవతల బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భైంసా శివారులోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నిర్మల్ జిల్లా నుండి పెద్దఎత్తున బీజేపీ నాయకులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, మర్రి శశిధర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు సభకు హాజరయ్యారు. బహిరంగ సభలో బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇవాళ మీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మా ప్రభుత్వం వస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను అభివృద్ధి చేస్తామన్నారు. బీజేపీ కార్యకర్తలపై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. భైంసాను దత్తత తీసుకుంటానని బండి సంజయ్ తెలిపారు. భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అని బండి నిలదీశారు. మనం ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నామని ఆయన ప్రశ్నించారు. భైంసాకు భరోసా కల్పించాడానికే తాను ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాషాయ పార్టీనే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హిందూవాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీయాక్ట్‌లు తొలగిస్తామన్నారు. వారికి ఉద్యోగాలిచ్చి గౌరవిస్తామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం నాయకులు ఎక్కడికైనా వెళ్లొచ్చు, ధర్మం కోసం పాటుపడే బీజేపీ నేతలపై మాత్రం ఆంక్షలు విధిస్తారా అని బండి సంజయ్ మండిపడ్డారు. భైంసా పేరును మార్చుదాం. బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను మహిషాగా మార్చుదాం. బహిరంగ సభకు కోర్టు మూడు వేల మందికి అనుమతి ఇచ్చింది. భైంసాలో 144 సెక్షన్ పెట్టారు పోలీసులు. ఇంకో రెండు కేసులు సెక్షన్లు పెట్టినా ఏంకాదు. జోష్ కోసమే భైంసాకు వచ్చాం. భైంసాకు భరోసా కల్పించడానికి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్నాం. సంక్రాంతి పండుగ చేసుకోకుండా వేధించారు. ఎంఐఎం గడ్డపై కమలం జెండాను ఎగురవేసే పార్టీ కమలం పార్టీ. మహిషా పాకిస్తాన్ లో ఉందా…? బంగ్లాదేశ్ లో ఉందా? అఫ్ఘానిస్థాన్ లో ఉందా…? సమాధానం చెప్పాలి. దేశం కోసం, ధర్మంకోసం పోరాటం చేస్తున్న బీజేపీని నిషేధిస్తారా…? అని ప్రేశ్నిచారు ...
-----------------------
Admin