సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వాస్కుల రామయ్య కోరారు.శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా జర్నలిజం వృత్తిగా భావించి విలేకరులుగా పనిచేస్తున్నారని తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని ఈ వృత్తి మీదనే ఇష్టంతో ఎంతోమంది సామాజిక సేవలో భాగంగా ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి గా నిరంతరం పనిచేస్తూ ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక చొరవతో సొంత మండలం అయిన మఠంపల్లి జర్నలిస్టులకు, మండలంలో పనిచేస్తున్న విలేకరుల అందరికీ ఇళ్లస్థలాలను కేటాయించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లక్షల రూపాయల పథకాన్ని మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాండు నాయక్ రవీందర్ నాయక్ శివారెడ్డి పల్లె సుధాకర్ చిలక సైదులు పాల్గొన్నారు.
-----------------------
Admin