సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట, డి కుమార్ రిపోర్టర్,, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ,మాజీ ఎంపీపీ తక్కళ్ళపెల్లి రవీందర్ రావు హన్మకొండలోని ఎమ్మెల్యే స్వగృహాంనందు మాతృమూర్తి దొంతి కాంతమ్మ చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలీ ఘటించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డితోపాటు ఎమ్మెల్యే సోదరులను పరామర్శించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బూర సుమన్ గౌడ్ ప్రముఖ పాత్రికేయులు రాజేశ్వర్ రావు,బుడిగె మల్లేష్,గుగులోత్ కిషన్ నాయక్,వల్లభనేని కిరణ్,రాజీరెడ్డి,మెహన్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
-----------------------
Reporter