Monday, 27 July 2026 03:45:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ అభివృద్ధికి మారుపేరు అంజయ్య యాదవ్...

Date : 20 November 2023 10:46 AM Views : 221

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : చీమకు కూడా హాని చేయని వ్యక్తీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అని ఎన్నికల ప్రచారంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, పిఎసిఎస్ మెకాగూడ ఛైర్మెన్ మంజుల రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి కిష్టయ్య, సీనియర్ నాయకులు వి.నారాయ ణరెడ్డిలు అన్నారు. బిఆర్ఎస్ నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు నోముల పద్మా రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నందిగామ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు వారు హాజరై మాట్లాడారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి పనులు 9 ఏళ్లలో నే ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్ నగర్ నియోజకవర్గం లో చేసిన చేసి చూపించారని, అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మచ్చలేని మా నాయకుని పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటేనే అంజయ్య యాదవ్, అంజయ్య యాదవ్ అంటేనే అభివృద్ధి ఈ రెండింటికి మించి షాద్ నగర్ కు మారుపేరే అంజయ్య యాదవ్ అని వారు కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా అంజయ్య యాదవ్ కృషితో షాద్ నగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని వారు గుర్తు చేశారు .కోట్ల నిధులు తెచ్చినాడు రామకా, షాద్ నగర్ పల్లెలను అభివృద్ధి చేసినాడు అంజన్న రామకా అని రామకా పాటలో అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, వారి ఆరు గ్యారంటీలు అమలు కావు కానీ ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతాడని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పతకాలను ముందు అమలు చేసి తెలంగాణాలో ఓట్లు అడగాలని విమర్శించారు. కారుకు ఓటేస్తే 24 గంటలు కరంటు, కాంగ్రెస్ కి ఓటేస్తే 3 గంటల కరంటు ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. ఆదమరిచి కాంగ్రెస్ కి ఓటేస్తే ఇక మన రాష్ట్రం దివాలా తీయడం ఖాయమని వివరించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో ఆయనను గెలిపించుకోవాలని, ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో అంజన్నను మంత్రిగా చేసి మరింత అభివృద్ధిని సాధించుకుందామని వారు ప్రజలను కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :