Sunday, 26 July 2026 09:57:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం - జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Date : 03 December 2025 08:30 PM Views : 171

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లాలోని వెల్ఫేర్ హాస్టల్స్‌, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీవీబీల్లో) ఏర్పాటు చేసిన ప్రత్యేక కంప్లైంట్ బాక్స్‌లకు అందిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.విద్యార్థుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, హాస్టల్ నిర్వహణలో లోపాలుంటే తక్షణమే సరిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్షలో ముఖ్యంగా ఈ సందర్భంగా విద్యార్థుల నుండి పలు సమస్యలపై ఫిర్యాదుల పెట్టె ద్వారా అందిన ఫిర్యాదులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు అందించిన పిర్యాదులను పరిగణలోకి తీసుకుని వాలీబాల్ కోర్టులు, మెడికల్ చెక్ అప్ కోసం మెడికల్ సూపర్వైజర్ ఏర్పాటు చేయాలని,నాణ్యత లోపం గల ఆహారం అందిస్తున్నారని,పేరెంట్స్ తో మాట్లాడడానికి టెలిఫోన్ సౌకర్యం కల్పన,భోజనం నాణ్యత, రోజువారీ సరఫరాపై అందిన ఫిర్యాదులు.ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించేలా సంబంధిత విభాగాల అధికారులకు కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలన్నారు. గీజర్స్, బ్లాంకెట్స్ లభ్యతపై ప్రత్యేక సమీక్ష చేసి హాస్టల్స్‌లో చలికాలం వేడి నీటి సౌకర్యం (గీజర్స్) లభ్యతపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు.అవసరమున్న హాస్టల్స్‌ వివరాలతో కూడిన నివేదికలను తక్షణమే సమర్పించాలని సంక్షేమ విభాగ అధికారులను ఆదేశించారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్‌ వారీగా హాట్ వాటర్ గీజర్స్, ఉలెన్ బ్లాంకెట్స్ వంటి తగిన వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.హాస్టల్ విద్యార్థుల వసతి, భోజనం, శుభ్రత, భద్రత, రోజువారీ ఆహార సరఫరా, డీలర్ల ద్వారా బియ్యం–పప్పులు వచ్చే విధానం, ఆహార నాణ్యతపై కలెక్టర్ సమగ్రంగా ఆదేశాలు జారీ చేశారు.సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, తెలంగాణ మోడల్ స్కూల్స్‌, కేజీవీబీ హాస్టల్స్‌ సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. హాస్టల్స్‌లో పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణకు అధికారులు, వార్డెన్‌లు, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు భాగ్యలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య, మైనారిటీ వెల్ఫేర్ అధికారి రమేష్, , జి సి డి ఓ ఫ్లోరెన్స్, ఆర్ సి ఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :