సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : దామరగిద్ద మండల పరిధిలోని ఉల్లిగుండం శివారులో గల శ్రీ గణేష్ కాటన్ మిల్లు యాజమాన్యం వే బ్రిడ్జి తూకంలో రైతులు అమ్మకానికి తెచ్చిన పత్తిని తూకం చేయగా కర్ణాటక రాష్ట్రం కానగడ్డకు చెందిన నాల్గురు రైతులు నాయినోల్లో భింరెడ్డి, హరిజన్ తిమ్మప్ప మారో ఇద్దరు రైతుల పత్తి వాహనం తూకం చేయగా 36క్వింటాల్ రావటంతో అనుమానం వచ్చి మిల్లు యాజమాన్యంను రైతులు నీలదీయాగా పొరపాటు జరిగిందని, మారో సారి కాట మీద తూకం చేయగా 48క్వింటాల్ వచ్చింది, దీనితో రైతులకు సర్ధి చెప్పి వారిని అక్కడ నుండి పంపించారు. సోషల్ మీడియా ద్వారా వైరలైన వీడియోలు చూసి తెలుసుకున్న రైతు వ్యవసాయ కార్మిక సంఘాల బృందం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉడమల్ గిద్ద గోపాల్, మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్ గౌడ్, సందర్శించి వే బ్రిడ్జ్ కాటన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మిల్లులు దగ్గర ఉన్న వే బ్రిడ్జ్ కాటాలను గాని కొనుగోలు కేంద్రాలను జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించకపోవడం వలన పత్తి మిల్లు దగ్గర మోసాలకు హద్దే లేకుండా పోయిందని అన్నారు.రైతులు కష్టపడి పెట్టుబడులు పెట్టి పండించినటువంటి పత్తిని మంచి ధర వస్తుందని ఆశించి, పంట పండిన తర్వాత ఇండ్లలో నిలువ చేసుకుని ధరలు పెరగకపోవడం వలన రైతులు ఏదో ఉన్నదరకు అమ్ముకుందామని ఉల్లిగుండం దగ్గర ఉన్న పత్తి మిల్లుకు తీసుకువచ్చి వే బ్రిడ్జి మీద తూకం వేగా ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం అడ్డదారుల్లో రైతులను మోసం చేస్తూ ఇప్పటికే వందలాది మంది రైతులతో కొన్ని వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు ప్రతి 10 క్వింటాళ్ల దగ్గర దాదాపుగా మూడు క్వింటాల్ రైతులను మోసం చేశారని వారు ఆరోపించారు. తూకం లో మోసం చేస్తున్న మిల్లు యజమాని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఇంత వరకు అమ్ముకున్న రైతులకు ఎంత మోసం చేశారో విచారణ చేసి రైతులకు అట్టి డబ్బులు చెల్లించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Sfi జిల్లా అధ్యక్షులు మోహన్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు....
-----------------------
Admin