సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలోని లక్ష్యా గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ప్రెస్ మీట్ లో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ రాందాస్ అతవాలే ఆదేశాల మేరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ ఇంఛార్జి గా ఈరోజు అధికారకంగా నియమిస్తూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ శ్రీ పేరం శివ నాగేశ్వరావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ శ్రీ పేరం శివ నాగేశ్వరావు, ఏపీ బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్, 27 మండలాల అధ్యక్షులు, సెక్రెటరీ లు, రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పలగానీ శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వర్శ వెంకన్న, జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నాపైన నమ్మకంతో నాకు భాద్యతలు ఇచ్చిన కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ రాందాస్ అతవాలే గారికి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ శ్రీ పేరం శివ నాగేశ్వరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
-----------------------
Admin