Sunday, 26 July 2026 12:37:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సామాజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్...

Date : 06 April 2023 01:01 AM Views : 566

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డా. బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన హాల్లో డా. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి, డిఆర్ఓ కొండయ్య, తదితరులు డా. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన జిల్లాలో రెండవసారి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. దేశానికి బాబు జగ్జీవన్ రామ్ మహోన్నతమైన సేవ చేశారన్నారు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక కోసం పోరాడి వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డా.బాబూ జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్  కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా దేశమంతట సమతా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉందని తెలిపారు  జగ్జీవన్ రామ్ పోరాటం, కృషితోనే దళితుల హక్కుల కోసం రిజర్వేషన్లు ఏర్పాటయ్యాయని, దళితుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. దాదాపు 30 సంవత్సరాలు బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర కేబినెట్ మంత్రిగా, సుమారు 46 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారని, ఆయనకి దక్కని హోదాలు లేవని, హరిత విప్లవానికి ఎంతగానో కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కొద్దికాలంలోనే గ్రామాల్లో స్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దళిత వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు తప్పనిసరిగా కృషి చేస్తామని తెలిపారు.ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రానికి ఎవరు పోటీ రాలేదని, గతేడాదికంటే నూతన జిల్లాలో అభివృద్ధి పరంగా ఎంతో మార్పు కనిపిస్తోందని, రహదారుల ఏర్పాటు, హౌసింగ్, డ్వామా, నాడు - నేడులో మార్పు ఎంతగానో కనిపిస్తోందని, గతంలో లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ఏర్పాటు చేయడం జరుగుతోందని, చాలా ముఖ్యమైన ప్రాథమిక అంశాల్ని ప్రభుత్వం పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన నిమ్న వర్గాలకు అనేక పథకాలు అమలు చేయడంలో డా. బాబు జగ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేసి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. స్వాతంత్రం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరిగిన సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. ఎస్సీలకు సంబంధించి స్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యార్థించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, పెద్ద విద్యార్థులు మంచి విద్యతో మంచి స్థితిలోకి వస్తారని దాని ద్వారా ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని సీఎం భావించారని, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాల విద్యకు అత్యధిక నిధులు కేటాయించారని, పాఠశాలలను ఆధునీకరిస్తున్నారన్నారు. పాఠశాలల్లో నాడు- నేడు కింద జరుగుతున్న అభివృద్ధి పనులు అద్భుతం అన్నారు.  త్వరలో జిల్లాలో అంబేద్కర్ విగ్రహము ,బాబు  జగ్జీవన్ రామ్ విగ్రహం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ మాట్లాడుతూ విలువలతో కూడిన డా.బాబు జగ్జీవన్ రామ్ జీవితం మనందరికీ ఆదర్శప్రాయం అన్నారు. మహోన్నత విలువలతో కూడిన ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.అంతకు ముప్పు జిల్లాకు చెందిన పలువురు దళిత సంఘాల నేతలు.. బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు.ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిడి శివ రంగ ప్రసాద్, ఆర్డీవో భాగ్యరేఖ,  పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్  ఓబుళపతి,వైస్ చైర్మన్  తిప్పన్న, పూడ  చైర్మన్   లక్ష్మినరసమ్మ .శ్రీ బేకరీ గంగాధర్, రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు. శ్రీ పైపల్లి నరసింహులు జిల్లా ఎమ్మార్పీఎస్ జనరల్ సెక్రెటరీ, శ్రీ సాయి శ్రీ ఎస్టిడి నరసింహులు ఎమ్మార్పీఎస్ లీడర్లు, శ్రీ రామాంజనేయులు కొత్తచెరువు ఎస్సీ లీడర్ శ్రీ రాయుడు ఎస్సీ ఉద్యోగ లీడర్, శ్రీ కేశప్ప ఎస్సీ లీడర్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: