సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : గాండ్లపెంట మండలం, రెక్కమాను నందు నూతనంగా. కురుమామిడి సచివాలయం భవనమును కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి ప్రారంభించారు.... మొదట ఎమ్మెల్యే కి ప్రజలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తూ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థలను మరియు వాలంటీర్ వ్యవస్థలను తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలనే కాకుండా మరిన్ని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టి నేటికీ 98.55% హామీలను అమలుపరిచారన్నారు. గ్రామస్థాయిలోనే అన్ని రకాలైన ప్రభుత్వ సేవలను తీసుకువచ్చి ప్రజలకు అత్యంత దగ్గరగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారన్నారు. దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో ఏ విధంగా మిగిలిపోయాయో, వారి తనయుడు వారి కంటే రెండు అడుగులు ముందుకేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. నిరంతరం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతం జగన్మోహన్, మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి భాస్కర్ రెడ్డి, కదిరి మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, చెప్పి కో ఆప్షన్ ఫయాజ్, సర్పంచు లు సుధాకర్, శాంతమ్మ, ఎంపీటీసీ గోపాల్ నాయక్, కోఆప్షన్ ఫయాజ్, ఆర్ బి కె చైర్మన్ శంకర్ నాయుడు, సర్పంచులు రవీంద్ర నాయక్, నాగభూషణ్ రెడ్డి, ఉత్తన్న, ఆంజనేయులు, నాగార్జున రెడ్డి, ఎంపీటీసీలు సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు, కాంట్రాక్టర్ ప్రతాప్ రెడ్డి, స్థల దాత లు ఓబులరెడ్డి, నీలకంఠారెడ్డి, మాజీ కోఆప్షన్ సికిందర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీరాములు, బీసీ సెల్ నరసింహ గౌడ్, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, గజ్జల లోకేశ్వర్ రెడ్డి, మదర్, గజ్జల రవీంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, హుస్సేన్ పీరా, డాక్టర్ ఖాజా, ఈశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్ర, ఎస్.సి, ఎస్.టి మోనిటరింగ్ కమిటీ సభ్యులు రాంప్రసాద్ నాయక్, శ్రీనివాసులు నాయక్, శంకర్ రెడ్డి, మైను, ఎంపీడీవో, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
-----------------------
Admin