సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : 2nd నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ జూన్ 11వ తారీఖున ఆంద్రప్రదేశ్ లోని గాజువాక విశాఖపట్నంలో జరిగినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీలలో మంచి క్రీడా ప్రతిభను కనబరిచి బంగారు పతకాలు, వెండి పథకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మత్స్యకార సంఘ అధ్యక్షులు కోళ్ల వెంకటేష్ మాట్లాడుతూ. కరాటే సాధన చేయడం వలన మానసిక ఉల్లాసము, శారీర దారుఢ్యము ,సంఘంలో గౌరవము, అదేవిధంగా మంచి క్రమశిక్షణతో పాటుగా చదువులో చురుకుదనం అందుకొరకే ప్రతి ఒక్కరూ ఈ కరాటే శిక్షణ తీసుకోవాలని వారు తెలియజేశారు. అనంతరము బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు: అఖిలా, కీర్తి ,మనీషా, వెండి పతకాలు: సాధించిన విద్యార్థులు వంశీ, అన్సర్ ,వినయ్, లను వారు మెడల్స్ మరియు సర్టిఫికెట్లను అందజేశారు. వారు మాట్లాడుతూ డ్రాగన్ చోటు ఖాన్ కరాటే డు స్పోర్ట్స్ వ్యవస్థాపకులు సలాం బిన్ ఉమర్ గారిని వారు అభినందించారు. నిరంతరము కరాటేలో మంచి క్రమశిక్షణను నేర్పుతున్నటువంటి సలాంబిన్ ఉమర్ మరియు కరాటే చీఫ్ ఎగ్జామినర్ అమ్రేష్, టోర్నమెంట్ ఇంచార్జ్ ఎండి సలీం లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో రేడియంట్ పాఠశాల డైరెక్టర్ అంజి రెడ్డి , ప్రిన్సిపల్ బాల్ రెడ్డి, మరియు కరాటే విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin