సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండల కేంద్రం లో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ, బహుజన కులస్తుల, అగ్రవర్ణ పేదల వ్యాపారాలపై మార్వాడీల దండయాత్ర చేస్తున్నారు అని రాష్ట్రంలో ఏ ఊరు చూసిన ప్రతి వ్యాపారంలోను మార్వాడీలు ఎంటర్ అయిపోయారు అని కొన్నాళ్ళకు మార్వాడి సేట్ల దగ్గర బానిస లాగా బతికే రోజు దగ్గర్లోనే ఉంది. మార్వాడీలు గుజరాతి రాజస్థాన్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం ఇక్కడ రావడం వల్ల మత పర విభేదాలకు ఇక్కడ ఆజ్యం పోస్తున్నారు. మన స్థానిక కులాల వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల బహుజన కులాలు కానీ మరే ఇతర వ్యాపారులు కానీ ఉన్నారా లేరు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే బహుజన కులాల కిరాణా షాపులు దెబ్బతీసి, లేకుండా చేసి హోల్ సేల్ వ్యాపారం అంటూ మార్వాడీలు మన స్థానిక ప్రజల డబ్బులు మొత్తం వాళ్ళే దోచుకు పోతున్నారు. మన స్థానిక బహుజన కులాలు ఏదైనా వ్యాపారం చేద్దామంటే పోటీకి నిలబడే పరిస్థితి లేకుండా ఎంతో తెలివిగా మార్వాడీలు కుట్రలు చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన బహుజన కులాలకు వ్యాపారం చేసే స్థోమత కోల్పోయి మార్వాడీ ల దుకాణాలముందు బిచ్ఛం అడుగుకునే దుస్థితి కి దిగజారుతారు. భవిష్యత్తులో బహుజన కులాల చిన్న చిన్న వ్యాపారులు ఉండరు. స్థానికంగా మార్ట్ ల పేరుతో వస్తే వారినీ బహుజన్ సమాజ్ పార్టీ అడ్డుకుంటుది అని పేర్కొన్నారు.
-----------------------
Admin