సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం లోని పెదవీడు గ్రామంలోని రామాలయానికి శ్రీరామ జన్మభూమి దీర్షక్షేత్రం ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సందర్భంగా అయోధ్య మందిరంలో నుండి వచ్చిన అక్షింతలు పంపిణీ కార్యక్రమం లో భాగంగా పెదవీడు గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ అర్చకులు వెంకన్న బిజెపి నాయకులు సాముల నరసింహారెడ్డి స్వీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని గడపగడపకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు అక్షింతలు అందుకొనుటకు హారతితో స్వాగతం పలికి స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ బిబి కుతుబ్ చైతన్య యూత్ సభ్యులు, చింతలమ్మ గూడెం రామాలయ కమిటీ సభ్యులు బుర సోములు,గుత్తికొండ గురువారెడ్డి ,కృష్ణమాచారి, చాట్ల రామకృష్ణ , రెడపంగు సీతారాములు , నరసింహ చారి, కృష్ణమోహన్, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin