సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం చాలా మంచిది చాలా గొప్పది. భద్రాచలానికి వచ్చేసరికి కొంత ఇబ్బందులు కొన్ని సమస్యలు తలెత్తినట్టుగానే చెప్పవచ్చు.... భద్రాచల మండలానికి మొత్తానికి కలిపి ఒకే ఒక కంటి వెలుగు కేంద్రం భద్రాచల జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే అసలు సమస్య మొదలయింది కంటి వెలుగు కార్యక్రమం చుట్టూ పక్కల ఉన్న ప్రజలకు భాహు దూరా భారంగా మారింది. ఎంతో దూరం నుండి కాలినడకన ఈ కేంద్రానికి చేరుకునేవారు కొంతమంది అయితే . మరికొందరు ఆటోల ద్వారా ఈ కేంద్రానికి వస్తున్నారు భద్రాచలం ఆటో ఖర్చులు మామూలు విషయం కాదు అయినప్పటికీ ఈ కేంద్రానికి వచ్చిన తర్వాత ఒక సమస్య వచ్చింది దీనిపైన అధికారులు రెవెన్యూ వారు గానీ కంటి వెలుగు వైద్య అధికారులు కానీ దృష్టి సారించాలి అది ఎలా అంటారా ఒకే ఒక కేంద్రం కావడంతో కంటి సమస్య ఉన్నవారు ఎక్కువ మొత్తంలో ఈ కేంద్రాలకు తరలిరావడం జరుగుతుంది సమయాభావం వలన ప్రతి రోజు 100 నుండి 150 లోపుగా చూడడం జరుగుతుంది మిగతా వారిని వెళ్లి మళ్లీ రేపు రాండి అని చెప్పి పంపుతున్నారు వ్యాయ ప్రయాసలకు కోర్చి ఇక్కడికి వచ్చి మళ్లీ తిరుగు ముఖం పడటం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని ఇంకా మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయుటకు లేదా పల్లె దావకాన కేంద్రాల వద్ద మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే భద్రాచల ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుంది అని భద్రాచల ప్రజల మనవి....
-----------------------
Admin