సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్: సీఎం కేసిఆర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఆరుట్ల రాజేశ్వర్(ఎల్ఎంబి) పదవికాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎల్ఎంబి రాజేశ్వర్ సెక్రటేరియట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీఎం కేసిఆర్ గారు మీ మీద ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా పనిచేయాలని అన్నారు.
-----------------------
Admin