సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వందల ఎకరాల్లో వేసిన పంటలు నీళ్లు లేక ఎండి పోతున్నాయని సంబంధిత ఏఈ, డీఇ లను గిరిజన రైతులు ఎన్ని సార్లు వేడుకున్న ఫలితం లేక రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేయాల్సి వచ్చిందని సర్పంచ్ నర్సింహా మూర్తి అన్నారు. శనివారం బర్లగూడెం పంచాయతీ రైతులు సాగు నీళ్లు ఇవ్వాలని ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో రెండు గంటల పాటు భారీ రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ నర్సింహా మూర్తి, ఏ ఎన్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు మాట్లాడుతూ ఆదివాసీ రైతులు కాబట్టే అధికారులు సాగు నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు వారు తెలిపారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మధ్యతరహా ప్రాజెక్ట్ నీళ్లు అన్ని వృధాగా గోదావరిలో కలుస్తున్నాయని ఆరోపణలు చేశారు. చిన్న గంగారం దెగ్గర అనేకసార్లు కాలువ తెగితే అధికారులు పట్టించు కోలేదని అన్నారు. రైతులు చేసేది ఏమిలేక దిక్కు తోచని స్థితిలో తమ సొంత డబ్బులు పెట్టుకొని పలుమార్లు కాలువ నిర్మాణం చేసుకున్నారని తెలియజేసారు. గత కొన్నేళ్లుగా ప్రధాన కాలువ నిర్వహణ పనులు అధికారులు చేపట్టక పోవడం తో రామవరం చిరుతపల్లి దెగ్గర అధికంగా మట్టి పూడిక వచ్చి దిగువ ప్రాంతం లో ఉన్న రైతులకు సాగు నీళ్లు రావడం లేదని అన్నారు. రైతులు పలుమార్లు సహాయ కార్య నిర్వాహక అధికారి భైరి కార్తీక్ ని పూడిక తీయించమని కోరితే మీ సొంత డబ్బులు పెట్టుకొని పూడిక తీపించు కోమని చెప్తున్నారని పేద రైతులు వాపోతున్నారని అన్నారు. అప్పు చేసి జేసీబీ సహాయం తో కొంతమేరకు పూడిక తీపించు కున్నట్లు తెలిపారు. ఇంకా రెండు వందల మీటర్లు మట్టి పూడిక వచ్చిందని అది తొలిగిస్తే నీళ్లు వస్తాయని ప్రాజెక్ట్ అధికారి కార్తీక్ చెప్తే పట్టించు కోవడం లేదని అన్నారు., వేసిన పంటలన్ని నీళ్లు లేక ఎండి పోతున్నాయని సాగు నీళ్ల కోసం రైతులు రోడ్డు ఎక్కే దుస్థితి తీసుకొచ్చారని అధికారుల తీరుపైన వారు మండిపడ్డారు. వానాకాలం 4700 ఎకరాలకు, యాసంగి లో 2200 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నట్టు అధికారులు తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఎండి పోతున్న పంటలకు తక్షణమే నీళ్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రెండు గంటల వ్యవధిలో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడటం తో ఎస్ ఐ తిరుపతి రావు, ఎంపీడీఓ అడ్డురి బాబు అక్కడికి చేరుకొని ఆందోళన కారులను విరమంచాలని కోరినారు . కానీ రైతులు సంబంధిత అధికారి వచ్చి నీళ్లు ఇస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రోడ్డు మీదే పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. దీనితో ప్రాజెక్ట్ ఏఈ భైరి కార్తీక్ రైతుల దెగ్గరికి వచ్చారు. పూడిక తీసి, నీళ్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ఆయన్ని ప్రశ్నించగా , ఇందుకు బదులుగా సహాయ కార్యనిర్వాహన అధికారి భైరి కార్తీక్ తన చేతిలో ఏమి లేదని బదులు ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్వహణ కోసం కొంత నిధి కేటాయిస్తారని, అందులో నుండి అత్యవసర విధానం లో కొంత ఖర్చు చేసి నీళ్లు ఇవ్వమని కోరినప్పటికి ప్రాజెక్ట్ అధికారి మౌనం వహించారు. అధికారి తీరుపైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓ బాబు, ఎస్సై తిరుపతి రావు హామీ మేరకు రైతులు ఆందోళన విరమించారు. అట్టం సత్యం, ఇర్ప బాబు, మాజీ సర్పంచ్ వెంకటరమణ, వాసం నారాయణ, రమేష్, శివ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin