సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రచార జాతాలను సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ మోహనరావు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రజల్లో ఓటింగ్ యంత్రాల పనితీరు పై అవగాహన కల్పిస్తున్నట్లు యంత్రాల ద్వారా ఓటు వేసే విధానం యంత్రాల పనితీరు పారదర్శకతపై ఈ ప్రచార జాతలో అధికారులు అవగాహన కల్పిస్తారన్నారు. ఓటు వేసిన తర్వాత ఓటరు వేసిన ఓటు అభ్యర్థి గుర్తుకే ఓటు నమోదు అయ్యిందా లేదా కూడా ఈ యంత్రాల ద్వారా తెలియజేయాలని తెలిపారు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల లోని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీస్ నందు ప్రజలకు అవగాహన కల్పించు గ్రామ గ్రామాలలో అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎమ్మార్వో వజ్రాల జయశ్రీ నారాయణ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin