సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పరమ పవిత్ర హనుమాన్ దేవాలయం చౌడమ్మ గుట్టలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ అభిమానులు కార్యకర్తలతో కలిసి తెల్లవారుజామున ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి అదేవిధంగా శివాలయంలో ఆయన పూజలు చేశారు. ఎన్నికలకు ముందు కూడా ఆంజనేయస్వామిని దర్శించుకుని ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా గెలుపొందాక మొట్టమొదటిసారి ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే శంకర్ ను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు.
-----------------------
Admin