Monday, 27 July 2026 03:23:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నందిగామ మండలం మేక గూడా గ్రామంలో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరికలు....

Date : 10 July 2023 06:16 AM Views : 186

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నందిగామ మండలం : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ సర్కార్ ను నిలబెట్టి, మూడోసారి కూడా కచ్చితంగా కేసీఆర్ రాజ్యమే రాబోతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దీమా వ్యక్తం చేశారు. ఆదివారం నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేకగూడా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడవత్ రాజు, పాత్లావత్ భాస్కర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలో చేరినట్లు ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పిఏసిఎస్ చైర్మన్ మంజుల, ఎంపిటిసి రాజు, శిరీష, శ్రీశైలం, తిరుపతిరెడ్డి, నజీర్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ స్థాయిని ఆక్రమించిందని అన్నారు. ఎవరెన్ని రాజకీయాలు చేసిన ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారని, కచ్చితంగా మూడోసారి కూడా గులాబీ జెండా ఎగరబోతుందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో మేకగుడా గ్రామానికి చెందిన రాజు, భాస్కర్, ధన్సింగ్, శంకర్, పాండు, రమేష్, భాస్కర్, రెడ్యా, బాబు, వినోద్, శీను, దేవేందర్, లింగం, శివ, బాలరాజు, రవీందర్, బాబు, సుధాకర్, వేణుగోపాల్, బాబు, శివ, నరేష్, సిద్దు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :