సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా షాద్ నగర్ పట్టణ మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్న ఐలమ్మ విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి పూల మాలతో ఘనంగా నివాళులు అర్పించారు. వారితో పాటు చెట్ల వెంకటేష్, మల్చలం మురళి, మఠం ఋషికేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆనాడు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి, ఆ పోరాటంలో అసువులు బాసి అణగారిన వర్గాలకు అందరికి ఒక స్ఫూర్తి, వీరవనితగా చరిత్రలో నిలిచిన చాకలి ఐలమ్మను మనమందరం స్మరించుకోవాలని అన్నారు. తెలంగాణాలో ఉన్న మహిళలందరూ కారంపొడి, రోకలి బండలను ఆయుధాలుగా మార్చుకొని నిజాంపై పోరాటం చేసిన చరిత్ర ఎంతో గొప్పదని, మరి ఆ చరిత్రను ముఖ్యమంత్రి కెసిఆర్ అవమాన పరుస్తూ, తెలంగాణా వచ్చిన తర్వాత నిజామోడు గొప్పోడు అని చెప్పి, తెలంగాణా స్వాతంత్రం కోసం అమరులైన వీరుల చరిత్ర ను విస్మరించారని అన్నారు. అదేవిదంగా సెప్టెంబర్ 17 న తెలంగాణా విమోచన దినోత్సవాన్ని జరిపించాల్సిన ప్రభుత్వం సమైక్యతా దినోత్సవం పేరుతో చరిత్ర ను పూర్తిగా వక్రీకరిస్తుందని అన్నారు. సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ పార్టీ గొప్పగా మీటింగ్ లు పెట్టి అమరవీరులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కానీ స్మరించుకోలేదని అన్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం, కాసిం రజ్వి ఏంఐఎం పార్టీని మెప్పించడం కోసమే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విధానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జె నర్సింహా, శ్రీనివాస్ చారి, గజ్జల ప్రవీణ్, ఆంజనేయులు, గట్టొజు విజయ్, కాసోజు శివ, శ్యామ్ సుందర్, శ్రీశైలం, బాస రాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin