సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతే మండల కాంగ్రెస్ పఅధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, ఎన్నికల సమయంలో రాష్ట్రం లోని రైతులకు తప్పుడు హామీలిచ్చి, ఓట్లను దండుకొని గద్దనేక్కిన కెసిఆర్ సర్కార్ రైతులను మోసం చేస్తుందానీ మోతే మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారు ఆరోపించారు.ఈ సందర్బంగా రైతులకు ఇచ్చిన హామీ అయినా ఋణ మాఫీ నీ వెంటనే అమలు చెసి రైతులను ఆదుకోవాలన్నారు. మొన్నటిదాక అకాల వర్షలతో పంట పూర్తిగా రాలిపోతే, తుతు మంత్రాంగ అధికారులతో సర్వే చేయించారు తప్ప ఇప్పటికి ఏవోక్కా రైతును కూడా ఆదుకోలేదన్నారు. అంతే కాకుండా సకాలంలో వర్షలు పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలన్నారు.ఈ బి ఆర్ ఎస్ ప్రభుత్వం తప్పుడు హామీలిచి అధికారం లోకి వచ్చాక రైతులను విస్మరింస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేసి ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దన్నారు. అంతే కాకుండా అతి వృష్టి, అనవృష్టి తో రైతులు ఇబ్బంది పడకుండా ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు
-----------------------
Admin