సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఏం ఎల్ సి ఎన్నికల సందర్భంగా సోమవారం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూతురు, మరియు తనయుడితో కలసి నారాయణపేట జిల్లాలోని, కోస్గి,మద్దూర్,మక్తల్,మరికల్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమస్యల పట్ల నిరంతరం పోరాడుతున్న గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జి.సుధాకర్, నర్సిములు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవీందర్ రెడ్డి, పుర కౌన్సిలర్ ఎండి.సలీం, దామర్ గిద్ద మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, ఊట్కూరు మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి, యూసుఫ్ తాజ్, మహిముద్ ఖురేషి, లక్ష్మణ్, లింగం మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin