సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : గత పది సంవత్సరాల నుండి ఖమ్మం జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పోస్టును పూరించండనీ అలాగే తెలంగాణ కోర్ట్ ఫీస్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ 1956నీ సవరించి అందులో కొంత మొత్తాన్ని న్యావవద సంక్షేమనికి వినియోగించవచాలని బుధవారం ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యుడు తాళ్లూరి దిలీప్ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని మరియు లా సెక్రటరీ నర్సింగ్ రావు ను సెక్రటేరియట్ లోని వారి కార్యాలయంలో కలసి వినతి పత్రాలు సమర్పించారు. కొత్తగా ఎన్రోల్ అయినా న్యాయవాదులకి ఇన్సూరెన్సు కార్డ్స్ అప్లై చేసుకోవటానికి అవకాశం కల్పించినందుకు వినోద్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు బార్ సభ్యుడు దిలీప్ తాళ్లూరి. పై విషయాలపై వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారని తాళ్లూరి దిలీప్ పేర్కొన్నారు.
-----------------------
Admin