సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండలం చిన్నగుడిపాడు సచివాలయ సిబ్బంది అంతా మా ఇష్టం టైమింగ్స్ మాకు తెలుసు మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం వెళ్తాం అంటున్న సచివాలయ సిబ్బంది. చిన్నగుడిపాడు గ్రామపంచాయతీలో సచివాలయ సిబ్బంది తీరు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వాళ్ల తీరు ఉంది గ్రామంలోని రైతులు ప్రజలు సమస్యల కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలాగా తిరుగుతున్న ఏ ఒక్క అధికారి కూడా సచివాలయంలో అందుబాటులో లేకపోవడం వలన కాలి కుర్చీలను చూసి వెళుతున్న గ్రామ ప్రజలు. సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉండాల్సిన కనీసం ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వలన బాధతో తిరిగి వెళుతున్న గ్రామస్తులు సచివాలయ సిబ్బంది తీరును చూసి ముక్కును వేలేసుకుంటున్న వైనం. పై అధికారులు స్పందించి సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు...
-----------------------
Admin